"కోవిడ్ పై కాకాణి సమీక్ష"





శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, కోవిడ్ మరియు డెంగ్యూ వ్యాధుల పట్ల తీసుకుంటున్న చర్యలపై వైద్యులు, సిబ్బంది, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్షించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

మనుబోలు మండలంలోని రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి, పంటల సాగు పరిస్థితి, రైతులకు సరఫరా చేస్తున్న ఎరువుల వివరాలు, తదితర అంశాలపై రైతులు, అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే కాకాణి.

 కరోనా మూడవ విడత విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తూ, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా రెండవ విడత నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు, సలహాలు సరిగా పట్టించుకోకపోవడంతో, భారీగా ప్రాణ నష్టం సంభవించింది. కరోనా సోకుతున్న వారి సంఖ్య రోజు, రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తిగా అవసరమైన అన్ని ముందస్తు చర్యలతో పాటు, వ్యాధి సోకిన వారికి చికిత్స అందించేందుకు ఆక్సిజన్ పడకలతో సహా అన్ని ఏర్పాట్లు చేశాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండవ విడతలో ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడిన పరిస్థితిని గమనించి, ప్రధాన ఆసుపత్రులన్నింటిలో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణంతో పాటు, అవసరమైన ఆక్సిజన్ లైన్లు  ఏర్పాటు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక కేంద్రాలలో గతంలో అందించిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు, అదనంగా ఆక్సిజన్ సిలిండర్లను కూడా సిద్ధం చేశాం. గ్రామ సచివాలయాలలో పూర్తయిన వై.యస్.ఆర్.హెల్త్ క్లినిక్ లకు రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వి.పి.ఆర్.పౌండేషన్ ద్వారా సిద్ధం చేసిన 100 ఆక్సిజన్  కాన్సెంట్రేటర్లను జిల్లా వ్యాప్తిగా అందించనున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న 7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలకు అదనంగా, మనుబోలు మండలం, వీరంపల్లిలో, ముత్తుకూరు మండలం తాళ్లపూడిలో మరో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తున్నాం. గ్రామాలలో ప్రబలుతున్న డెంగ్యూ వ్యాధులపై సర్వే నిర్వహించి రక్త నమూనాలు సేకరించి, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. పంచాయతీ సిబ్బంది, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గ్రామాలలో సక్రమంగా పారిశుద్ధ్యం నిర్వహించడంతోపాటు, దోమలను నిర్మూలించడానికి చర్యలు చేపట్టాలి. సర్వేపల్లి నియోజకవర్గంలోని రైతులకు అవసరమైన ఎరువులను సజావుగా, సంపూర్ణంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా అందజేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఎరువుల కొరత ఏర్పడినప్పటికీ, నియోజకవర్గ వ్యాప్తిగా రైతాంగ అవసరాలకు లోటు రానివ్వకుండా ఎరువులు అందిస్తున్నాం. ఇటీవల కురిసిన వర్షాలకు నీటమునిగి, పాడైపోయిన ఆక్వా రైతుల ట్రాన్స్ ఫార్మ్ ల స్థానంలో కొత్త ట్రాన్స్ ఫార్మ్ లను ఏర్పాటు చేస్తాం. సర్వేపల్లి నియోజకవర్గ రైతాంగ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం.