కాకాణి ఆధ్వర్యంలో "జగనన్న వరం - సర్వేపల్లి జన నీరాజనం" వారోత్సవాలు
కాకాణి ఆధ్వర్యంలో "జగనన్న వరం - సర్వేపల్లి జన నీరాజనం" వారోత్సవాలు
"కాకాణి చేతులు మీదుగా పిల్లలకు చాక్లెట్ ప్యాకెట్ల పంపిణీ"
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "జగనన్న వరం - సర్వేపల్లి జన నీరాజనం" వారోత్సవాలలో భాగంగా నియోజకవర్గంలోని పిల్లలకు 50 వేల చాక్లెట్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన చిన్నారులు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో అంతర్భాగంగా కొనసాగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసేందుకు "జగనన్న వరం - సర్వేపల్లి జన నీరాజనం" పేరిట వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసే వారోత్సవాల్లో భాగంగా, నవ భారత పౌరులైన చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేస్తున్నాం. సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తిగా అంగన్వాడి పిల్లల నుండి పదవ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న 50 వేల మంది పిల్లలకు చాక్లెట్ ప్యాకెట్లు అందిస్తున్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడం వలన కలిగే ఉపయోగాలపై విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నాం. వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు జ్ఞాపికలతో పాటు, నగదు బహుమతులు కూడా అందిస్తాం. సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించడంతో, ప్రజలు జగనన్నకు ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమానికి స్వచ్ఛందంగా, భారీగా తరలి వస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో వారం రోజులు నిర్వహిస్తున్న ఉత్సవాలలో, భాగస్వాములవుతున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.