ఎం జె పి గురుకుల కళాశాలలో విద్యార్థులకు' ఐరన్- ఫోలిక్"మాత్రలు పoపిణి
ఎం జె పి గురుకుల కళాశాలలో విద్యార్థులకు' ఐరన్- ఫోలిక్"మాత్రలు పoపిణి
రవికిరణాలు ప్రతినిధి -దొరవారిసత్రం :
ప్రభుత్వం తలపెట్టిన అనీమియా ముక్తిభారత్ కార్యక్రమంలో భాగంగా రక్తహీనత నిర్మూలనకై అందరికీ ఐరన్- ఫోలిక్ యాసిడ్ మాత్రల ద్వారా హిమోగ్లోబిన్ శాతం వృద్ధి చెందే కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగానే" విప్స్ " కార్యక్రమం ద్వారా ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుండి, కళాశాల వరకు ఐరన్ ఫోలిక్ మాత్రలు పంపిణీ చేశారు. గురువారం ఎం జె పి గురుకుల కళాశాలలో ఐదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ పిల్లలకు భోజనానంతరం మాత్రలు పంపిణీ చేశారు. అదేవిధంగా 8 సచివాలయాల పరిధిలోని పాఠశాలల్లో ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతేకాకుండా ఈనెల 10న నిర్వహించిన ఎన్ డి డి కార్యక్రమంలో ఆరోజు గైర్హాజరైన పిల్లలకు మాఫ్ అఫ్ డే లో భాగంగా కొందరి విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు కూడా వేయడం జరిగింది. ఐరన్ ఫోలిక్ మాత్రల యొక్క ఉపయోగాలు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమా న్న ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్స్ సూపర్వైజర్ ఆశా కార్యకర్తలు నిర్వహించారు.