ప్రచురణార్థం:తేది:29-09-2022 డాక్టర్ జస్టిస్ పున్నయ్య కమిషన్ ఆదేశాల మేరకు ప్రతినెల 30వ తేదీన" పౌర హక్కుల దినోత్సవం" నిర్వహించాలని దళిత బహుజన రిసోర్ సెంటర్ ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ మల్లెల చిన్నప్ప, జిల్లా  ప్రతినిధులు దావల ప్రేమ్ కుమార్, దార్ల సంపూర్ణ రావు లు సత్తెనపల్లి డిప్యూటీ తాసిల్దార్ ప్రసాద్ కి వినతి పత్రాన్ని సమర్పించారు. జస్టిస్ పున్నయ్య గ్రామాల్లో అసమానతలు రూపుమాపటానికి దళిత గిరిజనులను అభివృద్ధి చేయడానికి సంక్షేమం, అభివృద్ధి, రక్షణ చట్టాలపై మండల తహసీల్దార్ అధ్యక్షతన నిర్వహించాలని ,మండలంలోని ఉన్నటువంటి అన్ని శాఖ అధికారులను మరియు పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి సమన్వయంతో గ్రామాల్లో" పౌర హక్కుల దినోత్సవం" నిర్వహించాలని వారన్నారు. దళిత గిరిజనులకు రక్షణగా వచ్చినటువంటి 1989 పిఓఏ యాక్ట్ ఎస్సీ ఎస్టీ చట్టంపై అవగాహన కల్పించి గ్రామాల్లో అన్ని కులాల వారు కలిసిమెలిసి జీవించే విధంగా రక్షణ చట్టాలపై అవగాహన పెంచి వారు అభివృద్ధికి తోడ్పడాలని , దళిత గిరిజనులపై దాడులు జరగకుండా ముందుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఒకవేళ దాడులు జరిగితే వెంటనే ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఎఫ్. ఐ. ఆర్ చేసి విచారణ చేపట్టాలని సంఘటన స్థలానికి ప్రభుత్వ మండల  అధికారులు మరియు జిల్లా అధికారులు వెళ్లి విచారించి దళిత గిరిజనులకు ప్రభుత్వ పరంగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వారన్నారు.