" కాకాణి చేతుల మీదుగా అంగన్వాడి నియామక పత్రాలు"





శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలో నూతనంగా ఎంపికైన అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు నియామక పత్రాలు అందించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గాన్ని, నెల్లూరు జిల్లాలోనే కొనసాగించడం ద్వారా అన్ని వర్గాలకు ఉపశమనం కలిగింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఎంపిక కమిటీ చైర్మన్ గా వ్యవహరించే జిల్లా కలెక్టర్ దగ్గరకు ఇంటర్వ్యూ కి వెళ్లడానికి కూడా, మనం కూతవేటు దూరంలో ఉన్న నెల్లూరు జిల్లాను వదిలి, బాలాజీ జిల్లాలకు వెళ్ళవలసి ఉండేది. సర్వేపల్లి నియోజకవర్గంలో అంగన్వాడీ పిల్లలకు ఇబ్బందులు కలగకుండా, ఖాళీలు ఏర్పడిన చోట ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా, నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీలు భర్తీ చేస్తున్నాం. పసిపిల్లలలోని సృజనాత్మక శక్తిని వెలుగు తీయడానికి అంగన్వాడీ సిబ్బంది ప్రధాన బాధ్యత వహించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధతో అంగన్వాడీ భవనాలు నిర్మించడంతో పాటు, అంగన్వాడీల ద్వారా చిన్న పిల్లలకు, గర్భవతులకు, బాలింతలకు, పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. నూతనంగా ఎంపికైన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పసిపిల్లలకు సేవలందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుకుంటూ, నా అభినందనలు తెలియజేస్తున్నాను.