హోమియోపతి దినోత్సవ శుభాకాంక్షలు బీజేపీ నేత డాక్టర్ మహేంద్ర యాదవ్

హోమియోపతి దినోత్సవ శుభాకాంక్షలు బీజేపీ నేత డాక్టర్ మహేంద్ర యాదవ్ 




 నెల్లూరు, రవికిరణాలు  ఏప్రిల్ 09 :

హోమియోపతి వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హనిమన్ జన్మదినం సందర్భంగా (ఏప్రిల్ 10) న ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ మహేంద్ర యాదవ్ శుభాకాంక్షలు తెలియచేసారు.. ఈ సందర్భంగా డాక్టర్ గారు మాట్లాడుతూ ప్రపంచంలో రెండవ అతి పెద్ద వైద్య విధానం హోమియోపతి అని, దీర్ఘకాలిక వ్యాధులలో సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియో వైద్యం మంచి ఫలితాలను ఇస్తుంది అని, రాష్టం లో 6 కళాశాలల ద్వారా హోమియో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు అని, కరోనా మహమ్మారి సమయంలో ప్రివెంటివ్ మెడిసిన్ గా కేంద్ర రాష్ట ప్రభుత్వలు హోమియోపతి మందులు యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేయడం ద్వారా కరోనా ని అరికట్టడం లో హోమియో వైద్య విధానం ఎంతగానో దోహదపడిందని తెలిపారు. కేంద్ర , రాష్ట ప్రభుత్వలు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అన్ని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో హోమియోపతి వైద్యులు నియామకం చేయాలని సూచించారు..ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్న ఆంధ్ర ప్రదేశ్ హోమియోపతి కౌన్సిల్ బోర్డు మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి కృషి తో ఏర్పాటుకు మార్గం సుగమమైంది అని అన్నారు..అన్ని ఆర్టీసీ మరియు కార్పొరేషన్స్ లో హోమియో వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు..నేషననల్ ఆయుష్ మిషన్ (NAM), స్టేట్ అన్యువల్ యాక్షన్ ప్లాన్ (SAAP) ద్వారా రాష్ట్రంలో అన్ని హోమియో వైద్య కళాశాలలను మరియు ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని కోరారు.. 2014 నుంచి మోదీ సర్కారు ఆయుష్ కృషి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ- EHS ,ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా కూడా ఆయుష్ సేవలను అందుబాటులోకి తీస్కొని రావాలని ఆయన సూచించారు.తన సొంత హోమియో క్లినిక్ (నమో హోమియో క్లినిక్-నెల్లూరు) ద్వారా ఎన్నో ఉచిత వైద్య శిభిరాలు ఏర్పాటు చేసి రోగులకు ఉచితంగా మందులు అందిస్తున్నామని డాక్టర్ గారు తెలిపారు..

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget