వి.ఎస్.యూ లో యం బి ఏ విద్యార్థులకు క్యాంపస్ డ్రైవ్
నెల్లూరు [వెంకటాచలం], రవికిరణాలు ఏప్రిల్ 19 :
కాకుటూరు లోని విక్రమ సింహాపురి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో, ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో యం బి ఏ విద్యార్థుల కోసం క్యాంపస్ డ్రైవ్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంస్థ రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ తరఫున ప్రతినిధులు పాల్గొని, ఇంటర్వ్యూలు నిర్వహించారు.మొత్తం 25 మంది విద్యార్థులు ఈ క్యాంపస్ డ్రైవ్‌లో పాల్గొనగా, వారిలో 10 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులు త్వరలోనే డిపార్ట్‌మెంట్ స్టోర్ మేనేజర్ హోదాలో సంస్థలో చేరనున్నారు.ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ప్రిన్సిపాల్ ఆచార్య సి.హెచ్. విజయ మాట్లాడుతూ, "మా విద్యార్థులకు నైపుణ్యాలతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడం విశ్వవిద్యాలయం ప్రధాన లక్ష్యం. ఈ విజయంతో మరిన్ని అవకాశాలను కల్పించే దిశగా కృషి చేస్తాం" అని తెలిపారు. అలాగే క్యాంపస్ డ్రైవ్ విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్లేస్‌మెంట్ సెల్ అధికారిణి డాక్టర్ జి. సాయి శ్రవంతికి అభినందనలు తెలిపారు.
ఈ అవకాశాన్ని కల్పించిన సంస్థకు మరియు ప్లేస్‌మెంట్ సెల్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Post a Comment