స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్రా పై ప్రజలకు అవగాహన కల్పించండి అదనపు కమిషనర్ వై. ఓ. నందన్
నెల్లూరు, రవికిరణాలు ఏప్రిల్ 16 :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల మూడో శనివారం నిర్దేశించిన "స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్రా" కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించి, పర్యావరణ పరిరక్షణలో వారిని కూడా భాగస్వాములు చేయాలని నెల్లూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ వై.ఓ. నందన్ సూచించారు.పబ్లిక్ హెల్త్ విభాగం, వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులతో సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ఐ.వి.ఆర్.ఎస్ విధానంలో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా పారిశుధ్య నిర్వహణ పనుల సంతృప్తి 70 శాతం కన్నా తక్కువగా ఉన్నట్లు గుర్తించామని, దానిని మెరుగుపరిచేందుకు అందరూ కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.ఇంటింటి చెత్త సేకరణలో తప్పనిసరిగా తడి పొడి చెత్తను విడిగా సేకరించేలా పారిశుద్ధ సిబ్బందిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. శానిటేషన్ మేస్త్రీలు విధుల్లో బాధ్యతగా వ్యవహరించాలని, విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రధాన రోడ్లు, వీధుల పరిశుభ్రతలో భాగంగా ఏ ప్రాంతాన్ని అసంపూర్తిగా వదలకుండా రోడ్ల చివరి వరకు ఎండ్ టు ఎండ్ శుభ్రం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో ఫ్లోర్ పాయింట్లు అన్నవి లేకుండా పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. చెత్త సేకరణ వాహనాలు చెత్తను తరలించే సమయంలో వ్యర్ధాలు రోడ్లపై పడకుండా తప్పనిసరిగా పూర్తిస్థాయిలో కప్పి ఉంచేలా జాగ్రత్త చర్యలు తీసుకునేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.భవన నిర్మాణ వ్యర్ధాలు, శిధిలాలు రోడ్లపై, వీధుల వెంట లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వాటిని తొలగించేయాలని కమిషనర్ సూచించారు.అన్ని డివిజన్లలో క్రమం తప్పకుండా డ్రైన్ కాలువల పూడికతీత, సిల్ట్ ఎత్తివేత పనులను చేపట్టాలని, తడి పొడి చెత్తను విడివిడిగా సేకరించేలా సిబ్బందిని పర్యవేక్షించాలని అదనపు కమిషనర్ ఆదేశించారు.ట్రేడ్ లైసెన్స్ ల మంజూరు, కొత్త లైసెన్సుల గుర్తింపు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని, బహిరంగ ప్రదేశాలలో వ్యర్ధాలు వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య, వెటర్నరీ డాక్టర్ మదన్మోహన్,ఈ.ఈ. రహంతు జానీ,పొల్యూషన్ ఎన్విరాన్మెంటల్ ఈ.ఈ. అశోక్ కుమార్, హోమ్ ల్యాండ్ ఏజెన్సీ సుమన్, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు, మేస్త్రీలు, సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment