వైభవంగా ధజారోహణ కార్యక్రమం
రవికిరణాలు, ఏప్రిల్ 09 :
వింజమూరు ఎర్రబల్లి పాలెం లో వెలసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు ధోజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు రాతికోట తిరుమలయ్య సుజాత దంపతులు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా కార్యక్రమాన్ని జరిపించారు యాగ్నిక స్వామి సునీల్ స్వామీజీ ఆలయ అర్చకులు రంగనాథ ఆచార్యుల ఆధ్వర్యంలో ముందుగా ధ్వజస్తంభాన్ని శుద్ధి చేశారు ధ్వజస్తంభాన్ని అలంకరించి గరుడ చిత్రాన్ని సమాయత్తం చేశారు అంటే స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు గరుత్మంతుని పంపుతున్నట్లుగా ఆ గరుడని జెండాను ధ్వజస్తంభం పైకి పంపారు అంటే దేవతలు అందరికీ ఆహ్వానం అందించి ఆయన స్వామివారి కార్యక్రమాలకు హాజరవుతారని నమ్మకం ప్రజారోహణ సమయంలో గరుత్మంతునికి ఏర్పాటు చేసే గరుడ ముద్దలను నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని సంతానం లేని మహిళలకు ప్రసాదంగా పంచిపెడతారు ఆ ప్రసాదాన్ని స్వీకరించిన మహిళలు సంతానవంతులై స్వామి వారి కృపకు పాత్రులు అవుతారని భక్తుల విశ్వాసం ఈ బ్రహ్మోత్సవాలు జరిగే కాలమంతా ఎలాంటి విజ్ఞాలు లేకుండా సజావుగా జరిగేందుకు దేవతలందరూ బ్రహ్మోత్సవాలను పరిశీలిస్తుంటారని నమ్మకం భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరి ధ్వజారోహణ కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తులతో కనులారా దర్శించి సంతానం లేని మహిళలు గరుడ ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమాలను ఆలయ ధర్మకర్త గణపం సుదర్శన్ రెడ్డి పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో ఉభయ దాతల కుటుంబ సభ్యులు రాతికోట కళ్యాణ్ సతీమణి హేమలత ఆలయ కమిటీ సభ్యులు భక్త బృందం గ్రామ ప్రముఖులు తదితరులు ఉన్నారు.
Post a Comment