చిరమన లో పోషహకార పక్షోత్సవాల కార్యక్రమం
నెల్లూరు [అనుమసముద్రంపేట], రవికిరణాలు ఏప్రిల్ 16 :
ఏ ఎస్ పేట మండలం చిరమన గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషకహార పక్షోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలింతలు, గర్భవతులు,చిన్నారులలో, పౌష్టిక ఆహారం లోపాన్ని నివారించడంపై 1000 రోజుల సంరక్షణ పై వివరించారు. అలాగే చిన్నారుల్లో పోషక ఆహారం,లోపం బరువు తక్కువ పిల్లలను గుర్తించి వారికి అదనపు ఆహారాన్ని తీసుకునే విధానాన్ని తల్లులకు పలు సలహాలతో సూచించారు. ఈ కార్యక్రమంలో, గర్భవతులు బాలింతలు చిన్నారులు హెల్త్ సూపర్వైజర్ సలోమి అంగనవాడి కార్యకర్తలు పి హేమమాలిని పద్మావతి కామేశ్వరి సుబ్బ రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment