టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు.
నెల్లూరు [కావలి] రవికిరణాలు ఏప్రిల్ 11 :
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ట్రంక్ రోడ్ లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్మించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి, బహుజన చైతన్య దీప్తి యువకులపై పోరాడి మహిళ విద్యకు అవశేషంగా కృషిచేసిన సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని తెలిపారు. సమాజంలో కుల, వ్యవస్థ నిర్మూలన స్త్రీ,పురుషులకు సమాన హక్కుల కోసం ఎంతగానో పోరాడిన సామాజిక యోధుడు అని వారి చేసిన సేవలను కొనియాడారు. విత్తినే ఆయుధంగా అందించిన పూలే మహాశయ, ఆశయ సాధనకు మనందరం కృషి చేయాల్సిన బాధ్యత ఉందని వారు తెలిపారు. కావలి నియోజకవర్గం లోని ప్రజలందరికీ అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహాత్మ జ్యోతిరావు పూలే అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా కావలి ఎమ్మెల్యే నివాళులు అర్పించారు.
Post a Comment