పోలీసుల సంక్షేమం పై పాలకులు దృష్టిపెట్టాలి
నెల్లూరు, రవికిరణాలు ఏప్రిల్ 10 :
చట్టపరంగా వారికి చెల్లించాల్సిన బకాయిలు ప్రభుత్వం విడుదల చేయాలని ఎక్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర హోం మంత్రి అనితకు బిజెపి నేత మిడతల రమేష్ విజ్ఞప్తి చేశారు.
నెల్లూరులో బుధవారం నాడు కలెక్టర్ కార్యాలయంలో పెండింగ్ బకాయిలపై ఇరిగేషన్ పంచాయతీ రాజ్ డి ఆర్ డి ఏ డ్రామా శాఖలపై సమీక్ష జరిగింది.
కానీ రోజుకు 24 గంటల పాటు అందుబాటులో ఉండే పోలీసు శాఖ బకాయిలు పెండింగ్ పై పాలకులు దృష్టి పెట్టకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
పోలీసులకు రావలసిన బకాయిలు మూడు సంవత్సరాలుగా విడుదల డి ఎ టి ఎ సరెండర్ లీవ్ లో ఫైనల్ క్లీన్ ఎన్కాష్మెంటు బకాయిలు దీర్ఘకాలంగా పెండింగ్లో రాష్ట్రంలో సాధారణ మధ్యతరగతి పోలీస్ కుటుంబాలు ఆర్థిక సమస్యలను సకాలంలో వారి అవసరాలు తీరే విధంగా చట్ట ప్రకారం వారికి రావలసిన బకాలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి రమేష్ విజ్ఞప్తి చేశారు
ఎండలో నిలబడి ఎండ తీవ్రతను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఆరోగ్య సంక్షేమం దృష్ట్యా వేసవికాలంలో పనిగంటలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బిజెపి నేత రమేష్ విజ్ఞప్తి చేశారు
Post a Comment