దుర్భరమైన రోడ్లతో అవస్థలు పడుతున్న ప్రజలు
నెల్లూరు, రవికిరణాలు ఏప్రిల్ 10 :
నగరంలో ని పొదలకూరు రోడ్డు ప్రాంతంలో రోడ్లు దెబ్బతిని దుమ్ము దుళితో దుర్భరంగా మారింది. నిత్యం ఈ రోడ్డు గుండా ప్రయాణాలు సాగించేవారు దుర్భరమైన రోడ్డుతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. నగరంలోని బట్వాడి పాలెం వద్ద ఉన్న రోడ్డు గుంటలమంగా మారింది. ఇక్కడ నిత్యం ట్రాఫిక్ సమస్య ఉండగా దీనికి తోడు ఈ దుర్భరమైన రోడ్డుతో ప్రజలు పడే అవస్థలు వర్ణాతీతం. ఈ ప్రాంతంలో వాహనాల జోరు కూడా అధికంగా ఉంది. బట్వాడి పాలెం, పొట్టెపాలెం రోడ్డు వరకు నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇసుక వాహనాలతో పాటు ఇతర వాహనాల జోరు కూడా ఎక్కువగా ఉంది. దెబ్బతిన్న ఈ రోడ్డు దుమ్ముదుళితో నిండిపోయింది. బట్వాడి పాలెం నుంచి పొదలకూరు రోడ్డు సర్కిల్ వరకు రోడ్డు అక్కడక్కడ దెబ్బతిని అధ్వానంగా మారాయి. దెబ్బతిన్న రోడ్లతో నిత్యం ప్రజలు అవస్థలు పడుతూనే ఉన్నారు. రోడ్ల పక్కనే మట్టి దిబ్బలు నిండిపోయి వాహనాల జోరుతో దుమ్ము దూళి ఎక్కువయ్యి ప్రజలు అనారోగ్యాల బారిన పడే విధంగా ఉంది. రోడ్ల ను శుభ్రపరిచే వాహనం ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం రోడ్లపై మట్టి, దుమ్ము దుళితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న పనులు వేగవంతం కాకపోవడంతో ప్రజలకు ఈ అవస్థలు తప్పడం లేదు. ఇకనైనా అధికారులు దెబ్బతిన్న రోడ్లు, దుమ్ము ధూళితో నిండిపోయి రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.
Post a Comment