ప్రభుత్వ లేఔట్ లో చిల్ల చెట్లను కొట్టుకొని అమ్ముకుంటున్న వైనం
లేఅవుట్లో వేసిన శిల ఫలకం తో పాటు రాళ్ల తొలగింపు
నెల్లూరు [జలదంకి], రవికిరణాలు ఏప్రిల్ 22 :
జలదంకిమండలంలోనిరామవరప్పాడు గ్రామంలో గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన జగనన్న లేఅవుట్ లో ఇటీవల గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు అండదండలతో కొందరు లేఔట్ లోని రాళ్లను సైతం తొలగించి అక్కడ ఉన్న చిల్ల చెట్లను నరుక్కొని అమ్ముకున్న వైనం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో సర్వేనెంబర్ 776/2 సర్వే నంబర్ లో 2.3 ఎకరాల విస్తీర్ణంలో గత వైసిపి ప్రభుత్వం ప్రభుత్వ లేఔట్లను ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి లేఔట్ లో లబ్ధిదారులకు హక్కు పత్రాలను అందజేసి ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం ఆ లే అవుట్ కు సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు దీంతో లేఔట్లు విపరీతంగా చిల్ల చెట్లు పెరిగాయి. ఈ లేఔట్ లో గత నాలుగు రోజుల నుండి గ్రామానికి చెందిన కొందరు లేఔట్ రాళ్లను తొలగించి అక్కడ ఉన్న చిల్ల చెట్లను సైతం పెకలించి అమ్ముకున్నట్లు వెలుగులోకి వచ్చింది. పేదలకు పంచిన నివేసన స్థలాలను సైతం అర్హులకు ఇచ్చిన వారికి కాకుండా చేసేందుకు గ్రామానికి చెందిన టిడిపి కి చెందిన ఒక నాయకుడు అండదండలతో లేఔట్ ను ధ్వంసం జరిగింది. ఈ లేఔట్ పూర్తి విస్తీర్ణం 2.3 ఎకరాలు ఉండడంతో గ్రామానికి చెందిన టిడిపి నాయకుడికి దీని ఆక్రమించుకునే ఉద్దేశం కలగడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. జలదంకి మండల అధికారులతో పాటు హౌసింగ్, జిల్లా అధికారులు స్పందించి లేఔట్ ఎందుకు ధ్వంసం చేశారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
Post a Comment