ఎమ్మెల్సీగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన బీద రవిచంద్ర.
నెల్లూరు [కావలి], రవికిరణాలు ఏప్రిల్ 16 :
శాసన మండలి సభ్యునిగా బీద రవిచంద్ర బుధవారం రెండవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని తన కార్యాలయంలో మండలి చైర్మన్ మోషే ను రవిచంద్ర వద్ద ప్రమాణ స్వీకారం చేయించి వారిని అభినందించారు. అనంతరం రవిచంద్రనువారి చాంబర్లో పలువురు కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు, టిడిపి వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్. శివప్రసాద్, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పెళ్ళకూరి శ్రీనివాసరెడ్డి,టిడిపి నెల్లూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి, నేతల కన్నబాబు, బీద గిరిధర్ తదితరులు పాల్గొని, బీద దంపతులకు అభినందనలు తెలిపారు
Post a Comment