పలు డివిజన్లో పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తున్న ఆరోగ్య అధికారి
నెల్లూరు, రవికిరణాలు ఏప్రిల్ 22 :
నెల్లూరు నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చైతన్య పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా మంగళవారం స్థానిక 38 వ డివిజన్ మద్రాస్ బస్టాండ్ కూరగాయల మార్కెట్ ఏసీ బస్ స్టాప్ వద్ద నైట్ శానిటేషన్ మస్టర్ కు హాజరై పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు.అదేవిధంగా ఉదయం 16వ డివిజన్ గుర్రాల మడుగు సంఘం, ఆదిత్య నగర్ లలో పర్యటించి ఖాళీ స్థలాల్లో వేసి ఉన్న చెట్ల కొమ్మలు, ఇతర వ్యర్ధాలను గమనించి వెంటనే తీసివేయాల్సిందిగా సూచించారు.డివిజన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలలో డ్రైను కాలువలలో ఎండిపోయిన ఆకులు చేరడం వల్ల అక్కడ దోమల లార్వా ఉత్పత్తిని గమనించి వెంటనే డీసిల్టేషన్ చేయించి స్ప్రేయింగ్ చేయించారు.డివిజన్ కు సంబంధించిన సెక్రటరీ, మేస్త్రిలు ప్రతిరోజు ఫీల్డ్ లో తిరిగి డ్రైను కాలువలలో ప్రవాహాన్ని పర్యవేక్షించాలని, ఎక్కడైతే సిల్ట్ చేరి ప్రవాహం లేకుండా ఉన్న ప్రాంతాల్లో డీసిల్టేషన్, స్ప్రేయింగ్ చేయించి రికార్డు మైంటైన్ చేయవలసిందిగా సూచించారు.నిర్దేశించిన ప్రమాణాలు, సూచనలను పాటించకుండా ప్రజారోగ్యానికి విఘాతము కలిగిస్తే సంబంధిత సిబ్బంది, కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖాధికారి హెచ్చరించారు.
Post a Comment