జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో చలివేంద్రాలు ఏర్పాటు
నెల్లూరు [సైదాపురం], రవికిరణాలు ఏప్రిల్ 16 :
సైదాపురం మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పరిషత్ కార్యాలయంలో అలాగే తాసిల్దార్ కార్యాలయం వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎండలు ఎక్కువగా ఉండటం వలన గవర్నమెంట్ ఆఫీసులు వద్ద బస్సు ప్రయాణికుల కూడలి వద్ద జనసంచారం ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ప్రజలకు మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎవరు కూడా ఎండలో ఎక్కువ సమయం గడప రాదని, ఎండలలో ఎక్కువ టైం గడపటం ద్వారా వడదెబ్బ తగులే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు కూడా వీలైనంతవరకు తగినంత నీరు తీసుకోవాలని మండల ఎంపీడీవో పురుషోత్తం శివకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం చంద్రశేఖర్ , వెలుగు సిబ్బంది ఇది తరులు పాల్గొనడం జరిగింది
Post a Comment