మాజీ ముఖ్యమంత్రి కుటుంబం పై అసభ్యకర వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: - ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట: -
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా కొందరు మంగపతి బాబాయ్ అనే ఫేస్బుక్ అకౌంట్ నుంచి చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆయా పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదులు అందిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆదేశాల మేరకు సూళ్లూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై బ్రహ్మనాయుడుకు ఫిర్యాదు చేశారు దీంతో ఎస్సై ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. అనంతరం ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా వారి వెనుక ఎవరున్నారు లోతుగా దర్యాప్తు చేసి బాధితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు లేనియెడల జిల్లా స్థాయి ఉన్నత అధికారులు దృష్టికి సైతం తీసుకెళ్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ నాయకుడు జెట్టి వేణు యాదవ్ వైసీపీ పట్టణ అధ్యక్షుడు వెల్లంపాలెం కృపాకర్ రెడ్డి, వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్ని సత్యనారాయణ, మిజూరు రామకృష్ణారెడ్డి మరియు వైసీపీ కార్యకర్తలు అలవల సురేష్, అల్లూరు రమేష్ రెడ్డి, చిలక యుగంధర్, బద్దిపూడి మోహన్ రెడ్డి, సుధాకర్ మొదలియార్ ,వంకా దినేష్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment