మైపాడు పంచాయతీలో పౌష్టికాహార పక్షోత్సవాలు
నెల్లూరు [ఇందుకూరుపేట], రవికిరణాలు ఏప్రిల్ 10 :
ఇందుకూరుపేట ప్రాజెక్ట్ మైపాడు పంచాయతీలో పౌష్టికాహార పక్షోత్సవాలు కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా సిడిపిఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ1000 రోజుల సంరక్షణ లో భాగంగా గర్భం ధరించిన నాటి నుండి బిడ్డ పుట్టి రెండేళ్లు నిండే వరకుగల రోజులను వెయ్యి రోజులుగాలెక్కకట్టి గోల్డెన్ డేస్ అని పిలుస్తారని , ఈవెయ్యిరోజులు తల్లి బిడ్డలకు ముఖ్యమైన రోజులు కనుక సంరక్షణను సంపూర్ణంగా అందించి మంచి పౌష్టికాహారం అందించి వారి పెరుగుదలకు ఆరోగ్యాభివృద్ధికి తోడ్పడాలని అలాగే అంగన్వాడీలో అందించే పౌష్టికాహారాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు.ఈపౌష్టికాహార పక్షోత్సవాలు15 రోజులు పాటు 08/04/25 నుండి 22/04/25 వరకు ప్రతి అంగన్వాడి కేంద్రంలో నిర్వహించి తల్లులకు అవగాహన కల్పిస్తారని వివరించారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మంజుల టీచర్లు మరియు హెల్పర్లు, గర్భవతులు, బాలింతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Post a Comment