సిగినాపల్లి రామనగర్ కాలనీ గ్రామంలో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు జెండా ఆవిష్కరణ

 రవి కిరణాలు ఏప్రిల్ 6 [  జీకే వీధి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా]




ఏప్రిల్ 6 భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవంన్ని పురస్కరించుకొని బిజెపి సీనియర్ నాయకులు దుక్కేరి.జ్ఞానేశ్వరరావు మరియు బిజెపి పార్టీ అరకు పార్లమెంట్ కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి& ఏ.ఎస్.ఆర్.జిల్లా సోషల్ మీడియా కన్వినర్ దుక్కేరి.ప్రభాకరరావు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు జెండాను ఆవిష్కరించారు,

అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దానపల్లి పంచాయతీ సిగినాపల్లి రామనగర్ కాలనీ గ్రామంలో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు జెండా ఆవిష్కరణ జరిగింది,ఈ కార్యక్రమంలో దుక్కేరి.ప్రభాకరరావు మాట్లాడుతూ జన సాంగ్ గా 1980 సంవత్సరంలో బిజెపి పార్టీ ఆవిర్భావం అయినప్పటినుండి బీజేపీ పార్టీ పితామహుడు శ్యాం ప్రకాష్ ముఖర్జీ,పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ,అటల్ బీహార్ వాజ్పేయి ,ఎల్కే అద్వానీ మొదలైన మహానీయులు బీజేపీ పార్టీ కి జీవం పోసి భారతదేశ శ్రేయస్సు కోసం భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ యొక్క కుటుంబ పాలన నుండి విముక్తి కోసం ఏర్పడినటువంటి బిజెపి పార్టీ  ఎన్నో బలిదానాలు,ఈరోజు వరకు భారతదేశంలో సామాన్య కార్యకర్తగా ప్రతి నాయకుడు కమలం జెండాని బుజస్కందాలపై మూసి ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించి ప్రస్తుతం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో వరసగా 2014 నుండి 30 వరకు కూడా అధికారంలో ఉన్న బిజెపి పార్టీలో సామాన్యుడు కూడా ఒక దేశ ప్రధానమంత్రిగా ఒక సామాన్యురాలు ద్రౌపతి మూర్ము భారతదేశ రాష్ట్రపతిగా ఇలా సామాన్యులు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక మంత్రిగా కూడా బిజెపి పార్టీలో  అధికారంలో రావటం సర్వసాధారణం,ఢిల్లీ నుంచి గల్లి వరకు సామాన్యుడి నుంచి ఆ సామాన్యుడి వరకు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రపంచ ఆర్థిక శక్తిలో ఐదో స్థానంలో ఉంచిన ఘనత బీజేపీ కేంద్ర ప్రభుత్వానిదే,భారతదేశాన్ని ప్రపంచందేశాలలో ఒక శక్తివంతమైన దేశంగా చేసి దేశ ప్రజలకు సూపరిపాలనను అందిస్తున్న ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ,మునుముందు కూడా భారతీయ జనతా పార్టీనీ పాలనను ప్రజా ఆశీస్సులు ఆదరణతో మళ్ళీ మళ్ళీ అధికారంలోనే ఉంటుందని అన్నారు,బీజేపీ పార్టీలో మా తండ్రి దుక్కేరి.జ్ఞానేశ్వరరావు 1987 నుంచి ఇప్పటికి కొనసాగుతున్నరు,నేను మా తండ్రి నడిచిన బాటలో బీజేపీ   పార్టీలో క్రియ శీలక నాయకుడిగా ప్రజా సేవకుడిగా జిల్లా స్థాయి కిసాన్ మోర్చా నాయకుడిగా, ఏ.ఎస్.ఆర్.జిల్లా సోషల్ మీడియా కన్వినర్ గా కొనసాగుతూ ఉండడం నాకెంతో ఆనందగా ఉంది బీజేపీ పార్టీ అధిష్టానం మమ్మల్ని గుర్తించి మాకు మంచి బాధ్యతలు ఇస్తుందని ఆశిస్తూ మా సేవలను మరింత ఉపయోగించుకుంటుందని,ప్రజలకు మరింత సేవ చేస్తామని ప్రజా నాయకుడుగా మా జీవితం అంకితం చేస్తామని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూనాను,భారత్ మాతాకీ జై,జై బిజెపి, ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.




Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget