10 వ తరగతి ఫలితాల్లో ఎం వి ఆర్ ఆర్ జిల్లాప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రభంజనం
నెల్లూరు [ఇందుకూరుపేట], రవికిరణాలు ఏప్రిల్ 23 :
ఇందుకూరుపేట మండలం నరసాపురంలోని స్థానిక ఎం.వి.ఆర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులు మండల స్థాయిలో పదవ తరగతి ఫలితాల్లో విజయ ప్రభంజనాన్ని కొనసాగించారు.
2025 మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి.ఇందులో 59 సంవత్సరాల పాఠశాల పదవ తరగతి ఫలితాల చరిత్రలో మొట్టమొదటిసారిగా అద్భుతమైన మార్కులతో గుడి భార్గవ్ 600 మార్కులకు గాను 593 మార్కులు సాధించి మండల స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు.పాఠశాల స్థాయిలో గుడి భార్గవ్ 593 మార్కులతో ప్రథమ స్థానాన్ని, షేక్ షాదికా 563 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, పామంజి మహేష్ 549 మార్కులతో తృతీయ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.510 కి పైగా 12 మంది విద్యార్థులు సాధించడం మరో అద్భుతమని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ అఖండ విజయాన్ని సాధించడం మా పాఠశాలకు గర్వకారణం అని పాఠశాల యాజమాన్య కమిటీ అభినందించింది. ఒక రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో, అంకితభావం గల అనుభవజ్ఞులైన సిబ్బందిని కలిగి ఉండటం మా పాఠశాల బలమని , ఈ స్థాయి విజయం సాధించడం మా విద్యార్థుల సామర్థ్యానికి ప్రతీక అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు కొనియాడారు.
ప్రభుత్వ పాఠశాల అంటే ఒక నమ్మకమని, అది ఈ ఫలితాలతో వెల్లడైందని విద్యార్థి భార్గవ్ తల్లిదండ్రులు శ్రీనివాసులు, సుజాత తెలిపారు.ఇదంతాఅనుభవజ్ఞులైన సిబ్బంది వల్లే సాధ్యమైందని విజేతల తల్లిదండ్రులు తెలిపారు.
ఇంతటి గొప్ప ఫలితాలను సాధించిన విద్యార్థులను పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు , గ్రామస్తులు , పూర్వ విద్యార్థులు కొనియాడారు.
Post a Comment