సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ చేసిన అధికారులను..

 సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ చేసిన అధికారులను..

ఘనంగా సన్మానించిన ఎస్పీ కృష్ణ కాంత్ 




నెల్లూరు క్రైం మేజర్ న్యూస్.

సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 

కుటుంబం,పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, ఎన్నో త్యాగాలు చేసి ఉంటారని..వారి యోగక్షేమాలు చూసుకోవడం పిల్లల బాధ్యత. చిన్న పలకరింపే తల్లిదండ్రులకు ఎంతో మనోధైర్యం, ఆనందాన్నిస్తుంది. ఓపికతో బాగా చూసుకోవాలని చెప్పారు.

ఎంతో నిబద్దత, అంకితభావంతో జిల్లా పోలీస్ శాఖకు అందించిన సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు.

పదవీవిరమణ పొందాక ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించి, వ్యాయమ క్రియలు, పుస్తక పఠనం వంటి ఆసక్తి గల అలవాట్లను అలవరుచుకోవాలన్నారు.

ఎటువంటి అవసరమైన సంప్రదించండి... ఏ సమయంలో అయినా అందుబాటులో ఉండి తోడ్పాటును అందించడం జరుగుతుందన్నారు. కావలి ఒన్ టౌన్ లో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చేసిన ఎస్ఐ అంబేద్కర్,  పిసిఆర్లో  విధులు నిర్వహిన్న ఏ ఎస్ ఐ  కృష్ణయ్య , బిట్రగుంట ఏఎస్ఐ  సుధాకర్ రెడ్డి,దగదర్తి ఏ ఎస్ ఐ మోహన్ రావు , గూడూరు వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులును , కుటుంబ సభ్యులు, పోలీసు అధికారులు, సిబ్బంది సమక్షంలో జ్ఞాపికతో, పూలమాలలతో సత్కరించి, వారి సేవలను కొనియాడి,  ఎస్పీ ఆత్మీయ వీడ్కోలు  పలికారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్.పి.(అడ్మిన్) సౌజన్య , డీఎస్పీలు సింధుప్రియ, శ్రీనివాసరావు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు మద్దిపాటి ప్రసాద్, అసోసియేషన్ నాయకులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget