విద్యార్థులను అభినందించిన ఉపాధ్యాయులు.
కృష్ణపట్నం హైస్కూల్ విద్యార్థులకు ఎన్ ఎం ఎస్ ఎస్ ఉపకార వేతనాలు.
ఎంపికైన ముగ్గురు విద్యార్థినిలకు అభినందనలు.
ముత్తుకూరు ,ఫిబ్రవరి 15 (మేజర్ న్యూస్) కృష్ణపట్నం జడ్పీ హైస్కూల్ చెందిన విద్యార్థినిలకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్( ఎన్ ఎం ఎస్ ఎస్) ఉపకార వేతనాలకు ఎంపిక కావడం జరిగింది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ స్కూలుకు చెందిన 12 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 8వ తరగతి కి చెందినటువంటి మిశ్రిత ,పూజిత, విష్ణు ప్రియలు ఈ పరీక్షల్లో పాసైనారు. ఈ సందర్భంగా శనివారం హైస్కూల్లో విద్యార్థులను అభినందించే కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు నిర్వహించారు. స్కూల్ హెడ్మాస్టర్ సరళ, శిక్షణ కల్పించిన ఉపాధ్యాయులు సంయుక్తంగా ప్రశంసించారు. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ కు కృష్ణపట్నం స్కూలు విద్యార్థులు ఎంపిక కావడం చాలా సంతోషకరమని హెడ్మాస్టర్ తెలిపారు. ఇదివరకే మహేశ్వరి అనే విద్యార్థిని కూడా ఎంపిక అయిన విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యా కమిటీ పాలకవర్గం ,తదితరులు పాల్గొన్నారు.
Post a Comment