47వ డివిజన్ లో జనసేన కార్యాలయం ప్రారంభం
రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన సుజయ్ బాబు
నెల్లూర :
నెల్లూరు నగరంలోని 47వ డివిజన్ కామాటి వీధిలో జనసేన డివిజన్ ఇన్చార్జి శ్రీమంతుల కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయాన్ని బుధవారం జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గి శెట్టి సుజయ్ బాబు ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సుజయ్ బాబు మాట్లాడుతూ నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ లోని ప్రతి డివిజన్ లో జనసేన పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజా సమస్యలు తెలుపుకునేందుకు వీలుగా ఈ కార్యాలయాలు ఉపయోగపడతాయని అన్నారు. కూటమి నేతలతో కలిసి సమస్యలు పరిష్కరించడంలో జనసేన నేతలు ముందుండాలని అన్నారు. ప్రతి డివిజన్ లో జనసేన జెండా రూపొందించే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన బలపరిచే దిశగా అడుగులు పడతాయని అన్నారు. రానున్న రోజుల్లో 47వ డివిజన్ లో జనసేన కైవసం చేసుకునే విధంగా అడుగులు వేయాలని జన సైనికులకు సూచించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు .. సుజయ్ బాబు ను పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర ప్రధాన కార్యదర్శులు శనివారపు అజయ్ బాబు , షేక్ కంతర్ , తెలుగుదేశం 47వ డివిజన్ ఇంచార్జ్ ధర్మవరపు సుబ్బారావు, దినేష్ జనసేన డివిజన్ ఇంచార్జులు కనగలూరు సురేష్ , నాగూర్ బాబు నగర కార్యదర్శి బాలు 47వ డివిజన్ నాయకులు పురుషోత్తం, తేజ ,బాల గోపాల్ , సుబ్రహ్మణ్యం , శ్రీను , రామారావు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment