హ్యాపీ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం.
కావలి మేజర్ న్యూస్: కావలి పట్టణంలో బుడంకుంట గిరిజన కాలనీలో హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు, బిర్యాని స్వీట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హ్యాపీ సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు ఖాదర్ బాషా మాట్లాడుతూ, కావాలి పట్టణానికి చెందిన ప్రస్తుతం గుంటూరులో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్. విజయచంద్ర తల్లి సాలమ్మ నాలుగవ వర్ధంతి సందర్భంగా 150 మందికి దుప్పట్లు బిర్యాని తో పాటు స్వీట్లు అందించడం వారి దాతృత్వానికి నిదర్శనమని తెలిపారు. విజయ్ చంద్ర మాట్లాడుతూ, పిల్లలను బాగా చదివించి మంచి ప్రయోజకులుగా తయారు చేయాలని వారు ఉన్నత శిఖరాలు అధిరోహించి పట్టుదలతో ఇష్టంతో కష్టపడి చదవాలని కోరారు. ఈ సందర్భంగా హ్యాపీ సేవా సంస్థ సభ్యులందరికీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ చంద్ర వారి కుటుంబ సభ్యులు గౌరవ సలహాదారులు చేవూరు ప్రభయ్య, విజయ్ దేవరకొండ, కారుణ్య కోచింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ శివన్నారాయణ, రత్నమ్మ, చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment