చేనేత వస్త్రాల తయారీలో ఏపీ అగ్ర భాగం..! ఇతర రాష్ట్రాలపై మోజు ఎందుకు..?

 చేనేత వస్త్రాల తయారీలో ఏపీ అగ్ర భాగం..! ఇతర రాష్ట్రాలపై  మోజు ఎందుకు..?

చేనేతల కడుపు కొడుతున్న రాష్ట్ర జౌళి శాఖ అధికారులు 

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేతన్నలు 

ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి చేనేతల డిమాండ్ 




నెల్లూరు సిటీ మేజర్ న్యూస్ 

ఆంధ్రప్రదేశ్లో  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వెంకటగిరి  పాటూరు నారాయణరెడ్డిపేట సంగం  కావలి ఎడవల్లి  జమ్మారం  వింజమూరు గూడూరు చెన్నూర్   ములుముడి సౌత్ మోపూర్  గుమ్మల దిబ్బ  చా మాదల  అనంతపురం జిల్లాలోని ధర్మవరం గుంటూరు జిల్లాలోని మంగళగిరి  బాపట్ల జిల్లాలోని చీరాల  కృష్ణా జిల్లాలోని ఘంటసాల  నలుమూలల చేనేత వస్త్రాలు తయారు చేసే అవకాశాలు ఉన్నప్పటికీ రాష్ట్రములోని జౌళి శాఖ అధికారులు కొంతమంది ఇతర రాష్ట్రాల పై మోజు చూపిస్తూ అవినీతికి ఆశపడి నేతన్నల కడుపు కొడుతున్నారని చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షులు బుధవరపు బాలాజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు 

మహారాష్ట్ర  తెలంగాణ నుండి వస్త్రాల సేకరణలో ఎవరి హస్తముందో బహిర్గతం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్లకు విజ్ఞప్తి చేస్తున్నాము 

మహారాష్ట్ర, తెలంగాణ నుండి వస్త్రాల దిగుమతులు ఆ వ్యాపారుల మాయాజాలంలో పడి రాష్ట్రంలోని నేతన్నల కడుపు కొడుతున్నారని 

ఇది బాధాకరమైన విషయం అని తెలియజేసినారు అదే విధంగా అవినీతికి పాల్పడుతున్న అధికారులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదులు అందాయని తెలుస్తుంది

ఈ అవినీతి అక్రమాలను రాష్ట్రంలోని పెద్దలు చొరవ తీసుకొని అలాంటి అధికారులపై చర్యలకు ఉపక్రమించాలని నేతన్నులు కోరుతున్నారు 

నేతన్నలు ఆప్కో కు  వస్త్రాలు సరఫరా చేస్తామని నేతన్నలు అడిగేందుకు వెళితే కమిషన్లు తీసుకునే అలాంటి అధికారి లోనికి కూడా అనుమతించకపోవడం సిగ్గుచేటని ఇదేనా నేతన్నలను ఆదుకునే ఏసులుబాటు  అని ప్రశ్నిస్తున్నారు మూడు లక్షల మంది పైగా చేనేతలు, రెండు లక్షల పైగా మగ్గాలు ఉంటే కనీసం నూలు, ముడి సరుకులు అందించకుండా చేనేత రంగాన్ని జోలి శాఖ నిర్వీరం చేస్తుందని రాష్ట్రంలోని నేతన్నలు వాపోతున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని తెలంగాణలో సేకరించిన వివరాల ఆధారాలతో ఏపీ విజిలెన్స్ కు నేతన్నల ఫిర్యాదు చేసిన విషయాన్ని మరోసారి ఆయన గుర్తు చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని ఆయన ఆశిస్తున్నాను అని అన్నారు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget