27వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి

 27వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి




బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్: నెల్లూరులో ఫిబ్రవరి 1 2 3 తేదీల్లో జరుగు సిపిఎం పార్టీ 27వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కామ్రేడ్ జొన్నలగడ్డ వెంకమరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని దామరమడుగు నుండి ఆ పార్టీ ఆటో , బైక్ ప్రచారం మొదలుపెట్టారు. ప్రచార బేరిని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేశాయని ఆ వాగ్దానాలు నెరవేర్చాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎన్నికల వాగ్దానాలు అమలు చేసే విధంగా ఈ మహాసభల్లో పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. సోమవారం మూడో తారీఖున 3 గంటలకు నెల్లూరు ఆత్మ బస్టాండ్ నుంచి వి ఆర్ కళాశాల వరకు భారీ ప్రదర్శన జరుగుతుందని, అదేవిధంగా వీఆర్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు కేంద్ర, రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. ఈ ప్రదర్శనకు, బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గండవరపు శ్రీనివాసులు , సిఐటియు మండల కార్యదర్శి చల్లకొలుసు  మల్లికార్జున, సిపిఎం పార్టీ నాయకులు గరికిపాటి సురేష్, పుత్తెటి మల్లికార్జున, రేకులకుంట అంకయ్య, విస్సా మునిస్వామి, కృష్ణ ప్రసాద్, శ్రీనివాసులు, షేక్ జానీ బాషా, దత్త శ్రీ కోటయ్య, కొమి శ్రీనివాసులు, కన్నయ్య రత్తయ్య, జానకి రామయ్య ,ప్రభాకర్, మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget