తబ్లిగ్ జమాత్ ఇస్తిమా కు విపిఆర్ ఫౌండేషన్ 25 లక్షల ఆర్ధిక సహాయం
ఇస్తిమా ఏర్పాట్ల పై ముస్లిం మతపెద్దలతో సమీక్ష నిర్వహించిన వేమిరెడ్డి దంపతులు
ఇస్తిమా పేరిట జరిగే ఇస్లామిక్ శాంతి సభలు కోవూరు నియోజకవర్గ పరిధిలో నిర్వహంచడం చాలా ఆనందంగా వుందన్నారు వేమిరెడ్డి దంపతులు. రాష్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి కొడవలూరు మండలం చంద్రశేఖర పురం వద్ద తబ్లిగ్ జమాత్ నిర్వహించే రాష్ట స్థాయి ఇస్తిమా గ్రౌండ్ ను ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి సందర్శించారు. ఫిబ్రవరి 22, 23 తేదీలలో రెండు రోజుల పాటు జరిగే ఇస్తిమా సందర్భంగా ఏర్పాట్ల పై ముస్లిం మత పెద్దలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట నలుమూలల నుంచి దాదాపు రెండు లక్షల మంది హాజరయ్యే ఇస్తిమాకు ప్రభుత్వ పరంగా తాగునీరు, శానిటేషన్, విద్యుత్, రవాణా తదితర సౌకర్యాల కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.
విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇస్తిమా నిర్వహణకు 25 లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ఇస్తిమా విజయవంతం చేసేందుకు పరిసర గ్రామాల ప్రజలు సహకరించాలని వేమిరెడ్డి దంపతులు కోరారు. ఫిబ్రవరి 22, 23 తేదీలలో రెండు రోజులపాటు ఇస్తిమా నిర్వహణకు సంబంధించి ఏ అవసరమొచ్చినా తనను సంప్రదించాలని కోరారు. అనంతరం రాష్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడుతూ వేమిరెడ్డి దంపతుల సహాయ సహకారాలు ముస్లిం పెద్దల పక్షాన ధన్యవాదాలు తెలియచేసారు. ఈ సందర్భంగా ఆయురారోగ్యాలతో వుండాలని ముస్లిం మతపెద్దలు వేమిరెడ్డి దంపతులకు ఆశీర్వచనాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి జాకీర్ షరీఫ్,మైనారిటీ నాయకులు నన్నే సాహెబ్ లతో పాటు పలువురు కొడవలూరు మండల టిడిపి నాయకులు, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.
Post a Comment