పదకొండు మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఆనం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ :
నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజక వర్గ పరిధిలోని 11 మంది బాధిత కుటుంబ లబ్ధిదారులకు రూ. 11.18 లక్షలు విలువైన ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం పంపిణీ చేసారు.వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నామని మంత్రి ఆనం పేర్కొన్నారు.
ఎన్ డి ఏ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా ఇబ్బందులుపడకూడదనే ఉద్దేశంతోనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
మీ కుటుంబానికి ఆసరాగా, ఇంటి పెద్దగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం చేస్తున్న గొప్ప మానవతావాది మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని బాధిత కుటుంబాల తరపున సీఎంకు మంత్రి ఆనం ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment