చాగణం. చాగణంరాజుపాలెం పొలం పిలుస్తుంది కార్యక్రమం
సైదాపురం మండలం మేజర్ న్యూస్ :- సైదాపురo మండలంలోని చాగణం. చాగణం రాజుపాలెం గ్రామంలోపొలం పిలుస్తుంది ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా పంట భీమా పై అవగాహన కలిగించడం జరిగింది వరి పంటలో ఎకరాకి 168 రూపాయల తో ఇన్సూరెన్స్ చేసుకుంటే 48000 రూపాయలు ఎకరాకి భీమా వర్తిస్తుంది అని తెలియ చేయటం జరిగింది అలానే మినుము పంట కి 38రూపాయలు చెల్లిస్తే ఎకరం కి 19000 రూపాయల భీమా పెసరకి 36రూపాయలు చెల్లిస్తే 16000 రూపాయల భీమా వర్తిస్తుందని తెలియచేయడం అలానే వరిపంటలో వచ్చు వివిధ రకాల తెగుళ్ళు గురించి చీడ పీడలు వాటి నివారణ చర్యలు గురించి మిరప లో కింద ముడత ( తెల్ల నల్లి) నివారణ ఈ యొక్క మిరప వచ్చే తెగుళ్ళకు మొదట దశలో నీటిలో కరిగే గంధకం (వెటబుల్ సల్ఫేర్ ) 20 లీటర్ల నీటికీ 60గ్రాం కలిపి పిచికారి చేయాలి వ్యాధి ఉదృత మధ్య నుండి ఎక్కువ ఉంటే స్పైరొమేసిఫైన్ 29.09% స్సీ 20 లీటర్ల నీటికి 20ml లేదా క్లో్రొఫెమాఫీర్ 10% SC అనే ముందు 20 లీటర్ల నీటికి 40ml కలిపి పిచికారి చేయాలి దానితోపాటు వేప నూనె 1500పీపీఎం అయితే 40ml 20 లీటర్ల నీళ్లు కి పిచికారి చేయాలి రైతులతో చర్చించి పలు రకాల పంటలపై సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో సైదాపురం మండల వ్యవసాయ అధికారి హైమావతి గ్రామ పెద్దలు రైతులు మరియు ఇతరులు పాల్గొన్నారు
Post a Comment