యు.టి.ఎఫ్ స్వర్ణోత్సవాలను జయప్రధం చేయండి యు టీ ఫ్ రాపూరు

యు.టి.ఎఫ్ స్వర్ణోత్సవాలను  జయప్రధం చేయండి యు టీ ఫ్ రాపూరు 




రాపూరు మేజర్ న్యూస్ 

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జనవరి 5,6,7,8 తేదీలలో కాకినాడ లో జరుగుతున్న స్వర్ణోత్సవ మహాసభలు లో భాగంగా ప్రచార జాత  సోమవారం ఉదయం 8 గంటలకు రాపూరు మండలానికి చేరుకుంది. ఆ ప్రచార జాతకు మండల,జిల్లా నాయకులతో స్వాగతం పలికిన రాపూరు యు.టీ.ఎఫ్ ఆఫీసు నందు పతాక ఆవిష్కరణ తో నెల్లూరు జిల్లాలో  ప్రచార జాత ను ప్రారంబించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యు.టీ.ఎఫ్ జిల్లా అద్యక్షులు వి.వి.శేషులు మరియు ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ , జిల్లా కార్యదర్శి బాలు  పాల్గొన్నారు.యు.టీ.ఎఫ్ రాపూరు  గౌరవాధ్యక్షులు పి.హరిప్రసాద్ రెడ్డి  పతాక ఆవిష్కరణ చేయగా, జిల్లా కళాకార బృందం పార్వతీశం ,సుబ్రమణ్యం   ఉద్యమ గీతాలతో అలరిస్తూ మండల కార్యకర్తలు, ఉపాధ్యాయులు బైకు ర్యాలీగా ఆర్టీసీ కాంప్లెక్స్ చేరడం జరిగింది.

అక్కడ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ మాట్లాడుతూ

 జనవరి 5, 6,7, 8 తేదీల్లో కాకినాడలో యు.టి.ఎఫ్ స్వర్నోత్సవ సంబరాలు జరుగుతాయని ఆ సందర్భంగా జరిగే ప్రచార జాతాల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయని,అలాగే ఎక్కువ మంది కాకినాడకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలలో వివిధ ప్రముఖులతో పాటు విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారు పాల్గొంటారని పేర్కొన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్ బి.వెంకటేశ్వర్లు, జిల్లా ఆడిట్ కమిటీ మెంబర్ ఆర్.శ్రీనివాసులు, మండల అధ్యక్షుడు ఆర్.రవికాంత్, ప్రధాన కార్యదర్శి ఎ.శివసాయి, కోశాధికారి కె.వి.బి.ప్రసాద్ , మండల నాయకులు కె.నాదానందరావు,సి.హెచ్ .సుందరయ్య,మహిళా కార్యకర్తలు ఎస్.సౌభాగ్యవతి,అరుణమ్మ,సుప్రియ,సుమలత,స్వాతి ,సుగుణమ్మ,అఖిల పాల్గొన్నారు. మండల నాయకులు బి.అంకయ్య,కె.వెంకటేశ్వర్లు, జి.పెంచల నర్సయ్య, బి.వెంకటేశ్వర్లు, సేఖర్ బాబు,డి.రాజేష్, జె.కళ్యాణ్ తేజ,ఆర్.సుబ్రమణ్యం, ఎమ్.సురేష్ తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget