మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంధి యానాదిశెట్టి ప్రథమ వర్ధంతికి నివాళులర్పించిన శాసనసభ్యులు కావ్య.
కావలి మేజర్ న్యూస్: కావలి పట్టడానికి నియోజకవర్గానికి సుపరిచితులు గ్రంధి యానాదిశెట్టి అంటే తెలియని పేద వాడి దగ్గర నుంచి ధనికుడి వరకు ఆయన పేరు తెలియని వారు బహుశా ఉండకపోవచ్చు. తను మున్సిపల్ వైస్ చైర్మన్ గా చైర్మన్ గా అలాగే మార్కెటింగ్ చైర్మన్గా రాజకీయాల్లో సుదీర్ఘంగా పదవులు అనుభవించి రాజకీయ ఉద్దండుడు స్వర్గీయ గ్రంధి యానాదిశెట్టి ఎంతో మందిని కావలి పట్టడానికి మున్సిపల్ కౌన్సిలర్స్ గా నిలబెట్టి గెలిపించి రాజకీయాల్లో ఒక ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి గ్రంధి యానాదిశెట్టి. వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా బుధవారం కావలి ముసలోన్లే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఘనంగా మొదటి వర్ధంతి వేడుకలను నిర్వహించారు. మొదటిగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కావలి అభివృద్ధి కోసం ప్రతిక్షణం పరితపించి తన జీవితాంతం వరకు ప్రజాసేవలోనే గడిపిన మహోన్నత నేత గ్రంధి యానాదిశెట్టి అని ఆయన కావలి అభివృద్ధి కోసం చేసిన కృషిని పట్టణ ప్రజలు ఎన్నడు మరువురని తెలిపారు. కావలి పట్టణ ప్రజలకు నిరంతరము ప్రజల మనసుల్లో ఉండిపోయిన మహోన్నత వ్యక్తి గ్రంధి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment