నెల్లూరులో అంతర్జాతీయ న్యూరాలజీ సదస్సు, పలు అంశాలపై డాక్టర్ బింధు మీనన్ చర్చ

 నెల్లూరులో అంతర్జాతీయ న్యూరాలజీ సదస్సు,  పలు అంశాలపై డాక్టర్ బింధు మీనన్ చర్చ

న్యూరాలజీ వైద్య విధానంలో నూతన ఆవిష్కరణలపై చర్చలు





తాజా సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణుల రాక

నెల్లూరు, మేజర్ న్యూస్ : రోగుల ఆరోగ్యం, సంరక్షణను మరింత మెరుగుపరిచేందుకు ప్రతీ ఏటా సదస్సులు నిర్వహించి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం తమకు ఎంతో గర్వంగా ఉందని నెల్లూరు అపోలో హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్, న్యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ బింధు మీనన్ సంతోషం వ్యక్తం చేశారు. శనివారం  నెల్లూరులోని హోటల్ మినర్వా గ్రాండ్ లో నెల్లూరు అపోలో హాస్పిటల్, చిత్తూరు అపోలో మెడికల్ కళాశాల, డాక్టర్ బింధు మీనన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో “పెరల్స్ ఇన్ క్లినికల్ న్యూరాలజీ” అనే అంశంపై 10వ వార్షిక అంతర్జాతీయ సదస్సు జరిగింది. రెండు రోజుల పాటూ జరిగే ఈ సదస్సు డాక్టర్ బింధు మీనన్ పర్యవేక్షణలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు దేశీయంగా మరియు అంతర్జాతీయంగా ప్రఖ్యాత సంస్థల నుండి 24 మంది న్యూరో స్పెషలిస్టులు హాజరయ్యారు. వారితో పాటూ 270 మంది వివిధ వైద్య నిపుణుల ప్రతినిధులు పాల్గొన్నారు. వైద్య విజ్ఞాన భాగస్వామ్యం, నెట్ వర్కింగ్, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ఒకే వేదికపై చర్చించి, రోగుల ఆరోగ్యం, సంరక్షణ మెరుగుపరిచేందుకు కలిసి విజ్ఞానాన్ని పంచుకోవాలని నిర్ణయించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నాలుగు గంటల సమయాన్ని కేటాయించడం గమనార్హం.

“పెరల్స్ ఇన్ క్లినికల్ న్యూరాలజీ” సదస్సులో భాగంగా  జాతీయ మరియు అంతర్జాతీయ న్యూరాలజీ నిపుణులు న్యూరాలజీ వైద్య విభాగంలో నూతన ఆవిష్కరణలపై చర్చించారు. అలాగే క్లిష్టతరమైన స్ట్రోక్ మేనేజ్ మెంట్, ఎపిలెప్సీ, న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్స్ అంశాలపై బృంద చర్చలు నిర్వహించి న్యూరాలజీ వైద్యంలో పలు నూతన విషయాలను తెలుసుకున్నారు. న్యూరాలజీ వైద్యంలో ఎదురయ్యే పలు సవాళ్లను ప్రత్యక్షంగా వివరిస్తూ వాటిని ఏ విధంగా విజయవంతంగా ఎదుర్కోవాలో నిపుణుల బృందం వర్క్ షాపులను కూడా నిర్వహించింది. ఎంతో క్లిష్టమైన పలు న్యూరాలజీ కేసులను చర్చించారు. సదస్సు అనంతరం డాక్టర్ బింధు మీనన్ వైద్య నిపుణులు, ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. సదస్సు విజయవంతం కావడం పట్ల ఆమె వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. “పెరల్స్ ఇన్ క్లినికల్ న్యూరాలజీ ” అనే అంశంపై గడచిన పదేళ్లు క్రమం తప్పకుండా సదస్సులు విజయవంతంగా నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఈ సదస్సుల్లో జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులు, ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని న్యూరాలజీ వైద్య రంగంలో సవాళ్లపై చర్చించి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం వైద్య రంగంలో గర్వించే విషయమని పేర్కొన్నారు. న్యూరాలజీ వైద్య రంగంలో నిపుణులు నూతన వైద్య విధానాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందుకెళితే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే అవకాశం ఉందని డాక్టర్ బింధు మీనన్ వైద్యులు, ప్రతినిధులకు సూచించారు. రోగుల ఆరోగ్యం, సంరక్షణను మెరుగుపరిచేందుకు నూతన వైద్య విధానాలు, పరికరాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు. ఈ సదస్సు నిర్వహణను అపోలో హాస్పిటల్స్ సిఈఓ నవీన్ రెడ్డి, నెల్లూరు అపోలో హాస్పిటల్ డైరెక్టర్  మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరాం సతీష్, అపోలోహాస్పిటల్స్ మెడికల్సర్వీసెస్ చీఫ్  డాక్టర్ రోహిణి, ఏపి మెడికల్ కౌన్సిల్ నుండి డాక్టర్ జి. అశోక్ పర్యవేక్షించారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget