ప్లెమింగో ఫెస్టివల్ నిధులను ప్రభుత్వ పాఠశాలకు ఉపయోగించాలి పిడిఎస్ యూ, ఎస్ ఎఫ్ ఐ
రవి కిరణాలు తిరుపతి జిల్లాసూళ్లూరుపేట:-
వామపక్షవిద్యార్థి సంఘాలు అయినటువంటి పి డి ఎస్ యు, ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య కి శనివారం వినతి పత్రం అందజేత.సూళ్లూరుపేటలో నిర్వహించు ప్లెమింగో ఫెస్టివలకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను పక్షులు పండుగ నిర్వహించే క్రీడ ప్రాంగానికి, ప్రభుత్వ పాఠశాల,కళాశాలకి ఉపయోగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు.
1. చిన్నపాటి వర్షానికె సముద్రంగా మారే క్రీడా ప్రాంగాన్ని లెవెల్ చేసి నీరు నిలబడకుండా చూడాలి.
2. వాకర్స్ ట్రాక్ గేమ్స్ ఆడే క్రీడాకారుల ప్రాంగానికి దగ్గరగా ఉంది దానిని ప్రహరీ గోడ దగ్గరగా మార్చాలి.
3. ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు కొన్ని సంవత్సరాలు నుండి తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు, వారికి త్రాగినీటిని ఏర్పాటు చేయాలి.
4. ఫ్లెమింగో ఫెస్టివల్ లో నిర్వహించే స్టాల్స్ ను విద్యార్థులకు కేటాయించి సైన్స్ పరమైనటువంటి పరికరాలను తయారు చేసి పెట్టే విధంగా చూడాలి.
ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు సూళ్లూరుపేట నియోజకవర్గ అధ్యక్షులు వరప్రసాద్.ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాజు, ఎస్ ఎఫ్ ఐ సూళ్లూరుపేట అధ్యక్షులు సుమన్, విద్యార్థులు పాల్గొన్నారు.
Post a Comment