అధ్యక్షుడు అలపాక శ్రీనివాసులు. వైకాపా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులుగా ఆలపాక.
అభినందించిన పార్టీ అధ్యక్షులు కాకాణి.
ముత్తుకూరు, డిసెంబర్ 21 (మేజర్ న్యూస్)జిల్లా పంచాయతీ రాజ్ వింగ్, గ్రీవెన్స్ సెల్ విభాగాల జిల్లా అధ్యక్షులుగా పంటపాలెం గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక సర్పంచ్ ఆలపాక శ్రీనివాసులు నియామకం కావడం జరిగింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి నియామకం ఉత్తర్వులు జారీ చేశారు. సర్వేపల్లి నియోజకవర్గానికి ఈ పదవి రావడం పట్ల పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.
Post a Comment