కాలనీ ఇచ్చారు పట్టాలు మరిచారు గిరిజనుల ఆవేదన
కొడవలూరు మేజర్ న్యూస్
కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామం మజారా తపతోపు నందు గిరిజన కాలనీ ఇచ్చి పట్టాలు మరిచిన కారణంగా ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో కొడవలూరు మండల తాసిల్దార్ గారికి 70 కుటుంబాలు గిరిజనులు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ కాలనీవాసులకు కాలనీ మంజూరు చేసి పట్టాలు ఇవ్వని దానివల్ల ప్రభుత్వం నుంచి వచ్చే గృహ నిర్మాణ పథకం అమలు కావడం లేదని వీరికి రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు వీలు లేకుండా పోయిందని మండల తాసిల్దార్ వెంటనే స్పందించి వీరికి పట్టాల మంజూరు చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మంది పాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి కరకటి మల్లికార్జున మయూరి సిద్ధార్థ బాబి మోహన్ రావు గిరిజన కాలనీవాసులు పాల్గొన్నారు
Post a Comment