అయ్యప్ప గుడిలో మండల పూజలు
నెల్లూరు, కల్చరల్, మేజర్ న్యూస్
స్థానిక వేదయపాలెం లో వేంచేసియున్న వేద శాస్త్ర స్వామిఅయ్యప్ప స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వామి వారికి కేరళ సాంప్రదాయ కార్తీకమాస మండల పూజలు మంగళవారం ఘనంగా జరిగినవి.ఉదయం పాలాభిషేకం, మహాగణపతి హోమం,ఉష పూజ, నవకాభిషేకం,ఉచ్ఛపూజ,శ్రీ వేలి ఉత్సవం, సాయంత్రం మహాదీపారాధన, భగవతి సేవా, అత్తాళ్ళ పూజ,శ్రీ వేలీ ఉత్సవం,పడి కర్పూరం, హరివరాసనం,కార్యక్రమాలు కేరళ తంత్రులచే ఘనంగా జరిగాయి.మండల పూజలకు బండి రాజారామ మోహన్ రెడ్డి మంజువాణి దంపతులు మధ్యాహ్నం అన్నదానం ఉభయకర్తలుగా సాదు వంశీధర్ సుమలత దంపతులు, బోడె బ్రహ్మానంద రెడ్డి విజయలక్ష్మి దంపతులు కాగా అయ్యప్ప స్వామి భక్తులకు రాత్రి బిక్ష కార్యక్రమంకు దాతలుగా వెంకటేశ్వర్లు సురేఖ దంపతులు వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు గూడల శేషగిరిరావు, కార్యదర్శి కత్తుల వెంకటరత్నం, కోశాధికారి గడ్డం రత్నయ్య, కత్తి మోహన్ రావు, గడ్డం విజయకుమార్, పావలా ప్రసాదు పలువురు అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు.
Post a Comment