వేరుశనగ మిని కిట్స్ విత్తన పంపిణీ.
విడవలూరు మేజర్ న్యూస్.
కృషీ విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్జి. లలిత శివ జ్యోతి ఆద్వర్యంలో రామతీర్థం పరిధిలోని శ్రీ గౌరీపురం గ్రామంలో వేరుశనగ పంటనందు సామూహిక ప్రతమశ్రేణి ప్రదర్శనా క్షేత్రం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు విశిష్ట రకం విత్తనం, ట్రైకోడెర్మ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లలిత శివ జ్యోతి మాట్లాడుతూ వేరుశనగ పంటను ఆశించు పురుగులు, తెగుళ్ల నివారణ, యాజమాన్యం గురించి రైతులు తెలుసుకోవాలన్నారు. రైతులు తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలని, ట్రైకోడెర్మ దుక్కిలో వేసుకోవాలని తెలిపారు. కుళ్ళు తెగుళ్ళు నులిపురుగులను ఈ రకం కొంతమేర తట్టుకొనే శక్తి ఉందని రైతులు వేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు విజయ్ కుమార్ నాయక్, లోకేష్ బాబు, రైతు సేవ కేంద్రం వ్యవసాయ సహాయకులు సాయి మహేష్, రైతులు పాల్గొన్నారు
Post a Comment