విద్య తోపాటు విలువలు కూడా ముఖ్యం.
- విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విలువలను నేర్పించాలి.
- నియోజకవర్గ స్థాయిలో ఉత్తమ విద్యార్థులకు నగతి బహుమతులను అందజేస్తాం.
- ఉత్తమ గురువులకు పురస్కారాలు.
- కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
విడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం మేజర్ న్యూస్.
నియోజకవర్గస్థాయిలో విద్యాశాఖ పై ప్రత్యేక దృష్టి ఉంచామని, విద్యార్థులకు కేవలం విద్యనే కాకుండా విలువలను కూడా నేర్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు పైనే ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం లోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీపీ ఎం శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ సర్వసభ్య సమావేశానికి కోవూరు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిగిలిన శాఖల కంటే ఎక్కువగా విద్యాశాఖ పై దృష్టి సారిస్తున్నానని తెలిపారు. విద్యాశాఖ గాడిలో ఉంటేనే మిగిలిన శాఖలు సక్రమంగా పనిచేస్తాయని ఆమె అన్నారు. కేవలం విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. విద్యతో పేద విద్యార్థుల సైతం ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మండలంలోని పలు పాఠశాలల్లో ఉన్న సమస్యలను తెలుసుకున్న ఆమె ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇకపై ప్రతి సంవత్సరం కోవూరు నియోజకవర్గ స్థాయిలో 15 మంది ఉత్తమ విద్యార్థులను గుర్తించి వారికి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నగదు బహుమతులను అందజేస్తామన్నారు. అలాగే ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు కూడా గుర్తించి వారికి సత్కారాలు చేస్తామని తెలిపారు. అలాగే రానున్న వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని సంబంధిత శాఖ అధికారులు ముందస్తు చర్యలను తీసుకోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా కొందరు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఈ సర్వసభ్య సమావేశానికి వివిధ శాఖ అధికారులు డుమ్మా కొడుతున్నారని అలాంటి వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సూరా ప్రదీప, ఎంపీడీవో శ్రీహరి, తహసిల్దార్ అంబటి వెంకటేశ్వర్లు, వివిధ శాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Post a Comment