వి ఎస్ యూ లో ఎస్ పి ఎస్ ఎస్ డేటా విశ్లేషణపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్…
వెంకటాచలం మేజర్ న్యూస్..
కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ వ్యాపార నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో "ఎస్ పి ఎస్ ఎస్ ఉపయోగించి డేటా విశ్లేషణ" అనే అంశంపై వారం రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (FDP) నిర్వహించ బడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు హాజరయ్యారు. విశిష్ట అతిథిగా రిజిస్ట్రార్ డాక్టర్ కే. సునీత , అలాగే గౌరవ అతిథిగా కే జె సి బెంగుళూరు నుండి డాక్టర్ సిహెచ్. రాజ్ కమల్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా, విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు మాట్లాడుతూ, "ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆధునిక డేటా విశ్లేషణా పద్ధతులను నేర్చుకోవడంలో కీలకమైనది. ఎస్ పి ఎస్ ఎస్ వంటి సాఫ్ట్‌వేర్‌లతో విద్యార్థులు మరియు అధ్యాపకులు పరిశోధనకు మరింత లోతైన అవగాహనను కలిగి, సమాచారాన్ని సమర్థవంతంగా విశ్లేషించగలరు. డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం విద్యారంగంలో మరియు వ్యాపార పరంగా కూడా అత్యంత ముఖ్యం" అన్నారు.
అంతేకాకుండా, "విద్యార్థులు డేటా విశ్లేషణ నైపుణ్యాలను పొందటంతో పరిశోధనలో మెరుగైన ఫలితాలను సాధించగలరని, అన్వేషణాత్మకమైన ఆలోచనలకు విస్తృత వేదికను అందించగలరని" ఆయన చెప్పారు.
కార్యక్రమంలో భాగంగా, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత మాట్లాడుతూ, "ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ డేటా విశ్లేషణకు సంబంధించి ఉన్నత స్థాయి నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమం అధ్యాపకులకు డేటా విశ్లేషణా పద్ధతులపై అవగాహన పెంచి, వారి బోధనా ప్రమాణాలను మెరుగుపరుస్తుందని" అన్నారు.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన డాక్టర్ సిహెచ్. రాజ్ కమల్ , ఎస్ పి ఎస్ ఎస్ సాఫ్ట్‌వేర్ యొక్క ఉపయోగం మరియు అన్వేషణాత్మక డేటా విశ్లేషణకు దాని ప్రాముఖ్యత గురించి ప్రసంగించారు.
అనతరం,డాక్టర్ సిహెచ్. రాజ్ కమల్ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు మరియు రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత శాలువా వేసి సత్కరించారు. వారి అమూల్యమైన విశ్లేషణా శిక్షణను అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. విజయ, విభాగ అధిపతి డాక్టర్ జి .సాయి శ్రవంతి, కోఆర్డినేటర్లుగా డాక్టర్ పి. చెంచురెడ్డి, డాక్టర్ జె. విజేత,డాక్టర్ వై.విజయ, డాక్టర్ ఆర్.మధుమతి, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Post a Comment