డి బి ఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కబడ్డీ పోటీలలో ఫైనల్ విజేతలు.
కావలి మేజర్ న్యూస్: డి బి ఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజులు పాటు జరిగిన అంతర్ జిల్లా అండర్ 19 కబడ్డీ పోటీలలో శుక్రవారం మూడో రోజు ఫైనల్ పోటీలు జరిగాయి ఈ ఫైనల్ పోటీల్లో వెస్ట్ గోదావరి మరియు శ్రీకాకుళం జట్ల మధ్య ఉత్కట్టంగా సాగిన ఈ పోరులో విజేతలుగా వెస్ట్ గోదావరి నిలిచారు. మొత్తం 13 జిల్లాల జట్లలో మూడు రోజులు పాటు ఈ పోటీలు జరిగాయి. ఫైనల్ లో రెండు జిల్లాల మధ్య పోటీ ఉత్కంఠంగా కొనసాగింది. ఫైనల్ విజేతలుగా ఈస్ట్ గోదావరి జిల్లా నుండి విజయ కేతనం ఎగరవేశారు. ఈ పోటీల్లో ప్రధమ విజేతగా ఈస్ట్ గోదావరి ద్వితీయ విజేతగా శ్రీకాకుళం తృతీయ విజేతగా నెల్లూరు చెట్లు గెలుపు పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ దాంశెట్టి శ్రీనివాస్ నాయుడు హాజరయ్యారు. అనంతరం వారిని అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ గెలుపు ఓటములు సహజమని ప్రతి మనిషి జీవితంలో పోరాడుతూ, ఉండాలని ఈ పోరాటంలో విజయం ఎవరిని వరిస్తుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ విజయం కోసం పోరాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిబిఎస్ కళాశాల కరస్పాండెంట్ దాంశెట్టి సుదీర్ నాయుడు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. వి. రావు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి. రమేష్ బాబు టీవీ ఈవో మధుబాబు ఆర్ ఐ ఓ శ్రీనివాసులు స్టేట్ కబడ్డీ నెల్లూరు జిల్లా అండర్ 19 ఆర్గనైజేషన్ సెక్రటరీ డి. శిరీష డి.ఎస్.టి.ఓ రాజు గవర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యనారాయణ జడ్పీహెచ్ఎస్ స్కూల్ పి. డి. చిరంజీవి, డి. బి. ఎస్ ఇంజనీరింగ్ కళాశాల పి. డి దాసరి శివసాగర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Post a Comment