జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయము: : శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా

 జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి  వారి కార్యాలయము: : శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా 







తేదీ : 22-10-2024 న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి

డాII ఎం . పెంచలయ్య   అధ్యక్షతన “ మాతా శిశు మరణాల సబ్ కమిటీ  సమీక్ష సమావేశము” జరిగినది. జిల్లాలో2024 గత ఆగష్టు, సెప్టెంబర్ నెలలలో సంభవించిన 2 మాతృమరణాలు మరియు 12 శిశు మరణాలకు గల కారణాలు మరియు లోపాలు గురించి క్షుణ్ణముగా సమీక్ష జరిగినది.


ఈ సందర్బముగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి  డాII ఎం . పెంచలయ్య గారు మాట్లాడుతూ ప్రతి గర్భిణీ స్త్రీ ని గుర్తించి త్వరిత గతిన  నమోదు చేయాలని, అన్నీ రకాల పరీక్షలు తప్పని సరిగా  చేయాలని మరియు  హై రిస్క్ గర్భిణీ స్త్రీల ను గుర్తించి సదరు గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఆటంకము లేకుండా  సంపూర్ణ ఆరోగ్య రక్షణ కల్పించి ప్రభుత్వ ఆసుపత్రి లో సుఖ ప్రసవము జరిగే వరకు సంబంధిత  ఆరోగ్య పర్యవేక్షకురాలుకు పూర్తి భాద్యత అప్పగించవలసిందిగా వైద్యాధికారులను ఆదేశించారు.


ప్రభుత్వఆసుపత్రులలో కాన్పులు జరిగేలాగా ముందస్తు ప్రణాళిక రూపొందించు కోవాలని, అర్హులైన ప్రతి గర్భిణీ స్త్రీకి  మరియు బాలింతకు  JSY & JSSK పథకాలు క్రింద లబ్ధి చేకూరేలాగా చూడాలని వైద్య ఆరోగ్య సిబ్బందిని D M & H O డాII ఎం. పెంచలయ్య గారు  ఆదేశించారు. ఏ తల్లి, బిడ్డ  కూడా రక్తహీనత వలన,  సకాలములో వైద్య సేవలు అందక మరణించినట్లు తమ దృష్టికి వస్తే సంబంధిత వైద్య ఆరోగ్య సిబ్బంది పైన  శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని  D M & H O డాII ఎం. పెంచలయ్య గారు హెచ్చరించారు.


ఈ కమిటీ సమీక్ష సమావేశంలో డాII గీతాలక్ష్మి హెచ్ఓడి(గైనిక్)జిజిహెచ్, డాII వి విజయలక్ష్మి అసోసియేట్ ప్రొఫెసర్  ఏసిఎస్ఆర్ మెడికల్ కాలేజీ, డాII ఏ ఉమామహేశ్వరి డిఐఓ,  జిజిహెచ్ పిడియట్రీషన్స్ డాII సింధు, డాII సంద్య, డాII పి ఎల్ దయాకర్ పిఓ (ఎఫ్ పి సి), డాII  ఎం రమేష్ డిపిఎంఓ,  శ్రీ కె కనకరత్నం డెమో, శ్రీమతి జి మంజుల డిపిహెచ్ఎన్ఓ, రమేష్ ఏఎస్ఓ  సంబంధిత వైద్యాధికారులు మరియు ఆరోగ్యసిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.


  జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget