సతీమణి రమాదేవికి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి నారాయణ
సతీమణి రమాదేవికి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి నారాయణ
- కేక్ కట్ చేసి అందరికి పంచి పెట్టిన నారాయణ
- ఆలయంలో ప్రత్యేక పూజలు, క్యాంప్ కార్యాలయంలో సంబరాలు
నెల్లూరు, మేజర్ న్యూస్ : రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పుట్టిన రోజు వేడుకలను, కూటమి నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరులోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టి మొక్కు చెల్లించారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారాయణ చేతుల మీదుగా కేక్ కట్ చేసి అందరికి పంచి పెట్టారు. రమాదేవికి వీడియో కాల్ చేసి హ్యాపీ బర్త్ డే రమా అని నారాయణ విష్ చేయగా హ్యాపీ బర్త్ డే రమాదేవి మేడమ్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.
Post a Comment