ఆత్మకూరు అభివృద్ధి, భావి తరాల ప్రయోజనాల కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా : మంత్రి ఆనం

 ఆత్మకూరు  అభివృద్ధి, భావి తరాల ప్రయోజనాల కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా : మంత్రి ఆనం





ఆత్మకూరు, మేజర్ న్యూస్ 


 ఆత్మకూరు నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి, భావితరాల ప్రయోజనానికి ప్రత్యేక శ్రద్దతో కృషి చేస్తానని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి వెల్లడించారు.

నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో అనంతసాగరం మండల పార్టీ నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రసంగించారు.

భారీగా  అనంతసాగరం మండల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

ప్రతిఒక్కరిని పేరుపేరున ఆప్యాయంగా మంత్రి పలకరించారు.

అనంతసాగరం మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సభ్యత్వ నమోదుపై నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీ నాయకులు, కార్యకర్తల సూచనలు, సలహాల మేరకు అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తామని మంత్రి ఆనం పేర్కొన్నారు.

 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మే 27 నాటికి ఆత్మకూరులో శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి జరుగుతుందని మంత్రి ఆనం పేర్కొన్నారు.

 కంప్యూటర్లు, అర్జీల నమోదు, డేటా ఎంట్రీ,  అర్జీల  స్టేటస్, పూర్తిస్థాయిలో జవాబుదారీతనం ఉండేలా కార్పొరేట్ స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు.

ప్రతి సోమవారం  నియోజకవర్గ పరిధిలోని ఏదైనా ఒక మండల కేంద్రంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తాను కూడా పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సత్వరమే  సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆనం తెలిపారు.

ప్రతి ఒక్క కార్యకర్త కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని, పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేయాలని ఆయన సూచించారు.

రెండేళ్ల పార్టీ సభ్యత్వానికి 100 రూపాయలు ఆన్లైన్లోనే చెల్లించాలని,సభ్యత్వం చెల్లించిన ప్రతి ఒక్క కార్యకర్త సంక్షేమానికి పార్టీ కృషి చేస్తోందని మంత్రి ఆనం పేర్కొన్నారు.

యువత పెద్దఎత్తున రాజకీయాల్లోకి రావాలni మంత్రి కోరారు.

ఏ నియోజకవర్గంలో లేనివిధంగా సోమశిల జలాశయం, హైలెవల్ కెనాల్,  ఉత్తర కాలువ, సంగం  బ్యారేజీ వంటి సాగునీటి ప్రాజెక్ట్ లు, మూడు జాతీయ రహదారులు, నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ వంటి మౌలిక వనరులు మెండుగా ఆత్మకూరు కు ఉన్నాయని,.వీటిని సద్వినియోగం చేసుకుని ఆత్మకూరు అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.ఆత్మకూరు నియోజకవర్గంలో రాబోయే ఐదేళ్లలో  పరిశ్రమలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల ఏర్పాటు, వివిధ రెసిడెన్షియల్ కళాశాలల ఏర్పాటు, స్కిల్ కళాశాల ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నానని మంత్రి ఆనం తెలిపారు.గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులు, ఇరిగేషన్ పనులను మొదలుపెట్టనున్నామని  నాయకులందరూ గ్రామాలకు అవసరమైన అభివృద్ధి పనులను సూచించాలని ఆయన కోరారు.రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు.పారదర్శకంగా టెండర్ల ద్వారా లాటరీ పద్ధతిలో మద్యం షాపులను కేటాయించామన్నారు.

ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా సరికొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి పేదవాడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని  నాణ్యమైన అన్ని బ్రాండ్ల మద్యాన్ని క్వార్టర్ బాటిల్ రూ. 99 కే అందుబాటులో ఉంచుతున్నామన్నారు.

రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకుముఖ్యమంత్రి ఇండస్ట్రియల్ పాలసీని ప్రవేశపెట్టారని,ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని,ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు ఉన్నవారు వ్యక్తిగత అవసరాలకు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లవచ్చునని, ఏ అధికారి కూడా అడ్డుకోరని, ఎవరైనా అడ్డుకుంటే వారిని సస్పెండ్ చేస్తామని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని మంత్రి ఆనం వివరించారు.ఆత్మకూరు అభివృద్ధితోపాటు జిల్లా సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేయడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని ఆనం పేర్కొన్నారు.గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో కూడా కార్యకర్తలు అందరూ భాగస్వామ్యం కావాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి సి సి బి మాజీ చైర్మన్ మెటుకూరు ధనుంజయ రెడ్డి, అనంతసాగరం మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget