నీటి ప్రవాహానికి తెగిన నెల్లూరు టు తాటిపర్తి రోడ్డు
రామయ్య చెరువు కలుజు వద్దనెల్లూరు టు తాటిపర్తి రోడ్డు దెబ్బతినకుండా శాశ్వత ప్రాతిపదికన తూములను ఏర్పాటు చేయాలి.......... సిపిఎం.
నెల్లూరు రూరల్ (మేజర్ న్యూస్)
నెల్లూరు రూరల్ మండలం లోని సౌత్ మోపూరు రామయ్య చెరువు వద్ద గ్రామాలకు పోయే నెల్లూరు తాటిపర్తి రోడ్డు దెబ్బ తినకుండా శాశ్వత ప్రాతిపదికన తూములను ఏర్పాటు చే యాలని కోరుతూ సిపిఎం నెల్లూరు రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో 17వ కిలోమీటర్ తూము వద్ద ధర్నా నిర్వహించడం జరిగినది. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం నెల్లూరు రూరల్ మండల కార్యదర్శి ఆలూరు తిరుపాలు మండల కమిటీ సభ్యులు పూడిపర్తి జనార్ధన్ లు మాట్లాడుతూ....ప్రస్తుతం తాటిపర్తి రోడ్డు పనులు జరుగుతున్నాయని అయితే రోడ్డు పైన కనుపూరు కాలువ నీళ్లు, రామయ్య చెరువు నీళ్లు, ఎల్లవనీళ్లు రోడ్డు మీద పారుతుండడంతో రోడ్డు కు గండ్లు పడిపోయి వాహనాలు వెళ్లేందుకు ప్రయాణికులకు తీవ్రమైన అసౌకర్యం కలుగు తున్నదనీ, ఈ మార్గం గుండా నెల్లూరు రూరల్ మండలంలోని 15 గ్రామ పంచాయతీలు, పొదలకూరు మండలం, సంగం మండలాలకు పోయే వందలాది వాహనాలు, వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయితే దీనికి శాశ్వత పరిష్కారం మార్గంగా ఈ నీళ్లు పోయేందుకు రెండు చోట్ల తూములు ఉండేవని ప్రస్తుతం అవి లోపలికి కృంగిపోయినందువల్ల నీళ్లు వెళ్లకపోవడంతో రోడ్డు మీద పారి దెబ్బతింటుందని అన్నారు. దీనికోసం ఈ రెండు చోట్ల శాశ్వత ప్రాతిపదికన తూములను వేసి నీళ్లను మూలవాగుల గుండా నెల్లూరు కాలువలోకి పంపించినట్లయితే రోడ్డు దెబ్బ తినకుండా ఉంటుందని కాబట్టి వెంటనే ఈ రెండు చోట్ల తూములను వేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు రూరల్ మండల కమిటీ సభ్యులు జానా లక్ష్మీ ప్రసాద్, శ్రీపతి వెంకయ్య, అట్లా అనిల్, బాలు ఆదిశేషయ్య, అచ్చి అనంతయ్య, పేరిసెట్ల రత్నం, పర్చూరు ప్రభాకర్, మరిమేసి కామాక్షయ్య, పాదర్తి మస్తాన్, బద్దిపూడి వెంకటసుబ్బయ్య, పాదర్తి అంజయ్య, పాదర్తి చిరంజీవి తుళ్లూరు లక్ష్మయ్య, పాదర్తి మస్తానయ్య, పాదర్తి మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment