కన్సల్టేటివ్‌ కమిటీ ఫర్‌ ఎక్స్‌టర్నల్‌ ఎఫైర్స్‌ సభ్యుడిగా ఎంపీ వేమిరెడ్డి

 కన్సల్టేటివ్‌ కమిటీ ఫర్‌ ఎక్స్‌టర్నల్‌ ఎఫైర్స్‌ సభ్యుడిగా ఎంపీ వేమిరెడ్డి




నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మరో అరుదైన ఘనతను సాధించారు. ఇప్పటికే పబ్లిక్‌ అండర్‌టేకింగ్స్‌ కమిటీ, ఫైనాన్స్‌ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన ఆయన మరో కేంద్ర కమిటీలో స్థానం సంపాదించారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఛైర్మన్‌గా ఏర్పాటైన కన్సల్టేటివ్‌ కమిటీ ఫర్‌ ఎక్స్‌టర్నల్‌ ఎఫైర్స్‌ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 10 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలు ఎన్నికవగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాత్రమే స్థానం సంపాదించారు. ఈ కమిటీ విదేశాంగ విధానాలు, కార్యక్రమాలు, పథకాలపై చర్చిస్తుంది. విదేశీ వ్యవహారాల బలోపేతంలో తనవంతు పాత్ర పోషిస్తుంది. తనపై నమ్మకంతో ఇంతపెద్ద బాధ్యతను అప్పగించిన కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ వేమిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనపై చూపిన నమ్మకాన్ని తాను ఎప్పటికీ నిలబెట్టుకుంటానని, ఇప్పుడు తనకు అప్పగించిన కొత్త బాధ్యతలను నెరవేర్చడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget