ఇళ్ల మధ్య ఏర్పాటు చేస్తున్న బ్రాందీ షాపులు - బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలి
నెల్లూరు,కల్చరల్,మేజర్ న్యూస్,సిపిఎం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ నుండి వీఆర్సీ సెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించి ప్రజలు అభ్యంతరం పెట్టిన బడి,గుడి, ప్రార్థన మందిరాలు పరిసరాలలో బ్రాంది షాపు లను పెట్టొద్దు అని సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ మహిళలపై దాడులు అత్యాచారాలు మెజారిటీ శాతం మద్యం మత్తులోనే జరిగాయని గణాంకాలు చెబుతున్నాయని అన్నారు. అటువంటి మద్యాన్ని ఇళ్ల మధ్యకు తీసుకువచ్చి పెట్టడం మహిళలపై దాడులను ప్రోత్సహించడమేనని అన్నారు.బాధితుల పక్షాన నిలబడి సిపిఎం చివరి వరకు పోరాడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరరావు, పి సూర్యనారాయణ,కాయంబు శ్రీనివాసులు మరియు నగర కమిటీ సభ్యులు, కార్యదర్శులు, పార్టీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
Post a Comment