జాతీయ రహదారి పై ప్రమాదపు స్థలాలను గుర్తించి కర్వ్స్ ను
ఏర్పాటుచేసిన కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావు.
కావలి మేజర్ న్యూస్ :నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు కావలి డి.ఎస్.పి పి శ్రీధర్ సూచనల మేరకు శుక్రవారం 16వ నెంబర్ కావలి జాతీయ రహదారిపై (బ్లాక్ స్పాట్స్)ప్రమాదాలు జరుగు స్థలాలను గుర్తించి,కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావు సిబ్బందితోకలసి డ్రమ్ములు ,టైర్స్ లతో (వంపులు) కర్వ్స్ ను ఏర్పాటు చేశారు.జాతీయ రహదారిపై ప్రమాదపు స్థలాలను గుర్తించి వాహనదారులకు ప్రాణహాని జరగకుండా ముందస్తు జాగ్రత్తల కోసంవేగ నియంత్రణను అదుపు చేయాలని రహదారిపై సి.ఐ ఆధ్వర్యంలో సిబ్బందితో వెళ్లి డ్రమ్ములు, టైర్లు ఉపయోగించి కర్వ్స్ ఏర్పాటు చేశారు. వేగంకన్నా ప్రాణం చాలా విలువైందని వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదపు స్థలాల దగ్గర వేగ నియంత్రణ పాటిస్తూ ప్రాణాలను కాపాడుకోవాలని సీ.ఐ. రాజేశ్వరరావు వాహనదారులకు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ తో పాటు ఎస్సైలు సి.హెచ్ తిరుమల రెడ్డి, యం.బాజీబాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment