దొంగతనాలపై ప్రజల అప్రమత్తంగా ఉండాలి.
పొదలకూరు సీఐ రాంబాబు, ఎస్ఐ హనీఫ్
పొదలకూరు మేజర్ న్యూస్.
పట్టణంలోని ఆర్అండ్ బి అతిధి గృహంలో శుక్రవారం దొంగతనాలపై అన్నీ దుకాణాదారులతో సీఐ రాంబాబు ఎస్ఐ హనీఫ్ లు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ, ఎస్ఐలు మాట్లాడుతూ దొంగతనాలపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.ప్రతీ దుకాణానికి సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. పొదలకూరు మండలంలో త్వరలో 152 లొకేషన్ లలో 156 సిసి కెమెరాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని త్వరలో ప్రభుత్వమే సిసి కెమరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.అన్నీ జాగ్రత్తలు తీసుకుంటే నేరాలు కూడ తగ్గుముఖం పడుతాయని అన్నారు.ప్రతీ దుకాణానికి రెండు సిసి కెమరాలు ఏర్పాటు చేసుకోవాలని అవి కూడ రోడ్డుపై వెళ్లే వారి వీడియో తీసే విధంగా అమర్చుకోవాలని కోరారు. దుకాణాదారులు మహిళా దొంగలతో కూడ అప్రమత్తంగా ఉండాలని ఆదమరిస్తే కాజేస్తారని తెలిపారు.సిసి కెమెరాలు ఏర్పాటుతో దొంగలను త్వరగా పట్టుకునే అవకాశం ఉందని అన్నారు.ప్రతీ ఒక్క దుకాణాదారుడు హెచ్ డి సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోగలిగితే ఏదైన చోరి జరిగినప్పుడు ఆ విజువల్స్ తో దుండగులను త్వరగా పట్టుకునే అవకాశం ఉంటుదని తెలిపారు. గురువారం అర్ధరాత్రి ఓ బంగారు దుకాణంలో చోరికి యత్నించిన వారిని త్వరలో పట్టుకుంటామని అన్నారు.అపరిమిత వ్యక్తులు పట్టల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు ఊరి ప్రయాణాలు చేసే సమయంలో తమ వివరలు స్ధానిక పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని అన్నారు. మండలంలో ఎక్కడైనా గుర్తుతెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లయితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్స్ అక్తర్ భాషా, రసూల్ ,భాస్కర్ మరియు సిబ్బంది రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment