పెనుబర్తి గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం
నెల్లూరు రూరల్ (మేజర్ న్యూస్ )
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పెనుబర్తి గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం లో టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ....
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, రెవెన్యూ శాఖలో ఆన్ లైన్ ట్యాంపరింగ్, రికార్డుల తారుమారుపై అధికారులు గ్రామస్థాయిలో ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తారని తెలియజేశారు. గత వై.సి.పి. ప్రభుత్వ పాలనలో రెవెన్యూ పరంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, గ్రామస్థాయిలో జరిగే రెవెన్యూ సదస్సుల్లో రెవెన్యూ అధికారులు పాల్గొని, సమస్యలకు పరిష్కారం చూపుతారని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ మండల రెవెన్యూ అధికారి లాజరస్, మండల పరిషత్ ఉపఅధ్యక్షుడు పల్లం రెడ్డి రవీంద్ర రెడ్డి, టిడిపి నాయకులు భాస్కర్ రెడ్డి, దినేష్ రెడ్డి, ఏలూరు శీనయ్య, సుమంత్ రెడ్డి, జశ్వంత్ రెడ్డి, వాసు, రవి, ప్రసాద్, కేతి రమేష్ రెడ్డి, చల్ల సుధీర్, అలగల మల్లి, తాండ్ర పెంచలయ్య, పోలయ్య, నాగేంద్ర, పండయ్య, మరియు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment